కవలలకు తల్లైన ప్రీతి జింతా
- November 18, 2021
సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఇద్దరు పిల్లలకు తల్లైంది. 2016లో ప్రీతి జింతా ఫారెన్ బిజినెస్ మ్యాన్ జీన్ గుడెనఫ్ ని వివాహం చేసుకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరు కవల పిల్లలకు తల్లైంది. సరోగసి విధానం ద్వారా ప్రీతి జింతా, జీన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని ప్రీతి జింతా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
‘హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము. ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
తన కవల పిల్లలకు ‘జై జింతా గుడెనఫ్’, ‘జియా జింతా గుడెనఫ్’ అని అందమైన పేర్లతో నామకరణం చేసినట్లు ప్రీతి జింతా ప్రకటించింది. కాగా, సినిమాలలో తెగ సందడి చేసిన ప్రీతి జింతా ఐపీఎల్ మ్యాచ్లలోను హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ప్రీతి జింతా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









