యూఏఈ కేబినెట్ కీలక నిర్ణయం. పేదలకు హౌసింగ్ లోన్ మాఫీ
- November 30, 2021
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆదాయం తక్కువ గా ఉన్న ప్రజలకు హౌసింగ్ లోన్ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక అసమానతలను తగ్గించటం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ఈ డిసిషన్ తీసుకున్నట్లు ప్రకటించింది. దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ పో 2020 లో సమావేశమైన యూఏఈ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరగనుంది. యూఏఈ వైస్ ప్రెసిడెండ్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. హౌసింగ్ లోన్ మాఫీతో పాటు కీలకమైన నేషనల్ మెడిసిన్ పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసిది. ఈ నిర్ణయం కారణంగా దేశ ఫార్మాసిటికల్ రంగంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఫార్మా రంగంలో దేశీయ టాలెంట్ ను వాడుకోనున్నారు. అదే విధంగా ఖరీదైన మందులు పేదలకు కూడా అందుబాటులో ఉండేలా చేయనున్నారు. దీంతో పాటు పలు పొలిటికల్ డిసిషన్స్ ను కూడా సమావేశంలో తీసుకున్నారు. ఈ మీటింగ్ కు లెప్ట్ నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్ యాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటిరీయర్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహియాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









