డిసెంబర్లో బ్యాంకు సెలవులు..
- November 30, 2021ముంబై: ఈ ఏడాదిలో ఇదే ఆఖరు నెల. ఈ ఏడాదిలో పూర్తి చేయాల్సిన బ్యాంకు లావాదేవీలను డిసెంబర్ నెలలో ప్లాన్ చేసుకుంటే వాటిని పూర్తి చేసుకోవడం మంచిది. ఇందుకు సంబంధించి ముందుగా డిసెంబర్ నెలలో ఎన్ని బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు. మరి ఏఏ రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
డిసెంబర్ 5న ఆదివారం సందర్భంగా సెలవు. డిసెంబర్ 11 రెండో శనివారం. డిసెంబర్ 12న ఆదివారం రావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు. డిసెంబర్ 19 ఆదివారం కారణంగా సెలవు. డిసెంబర్ 25 క్రిస్మస్, నాలుగో శనివారం కలిపి వచ్చాయి. మరుసటి రోజు డిసెంబర్ 26 ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.
క్రిస్మస్ సెలవు నాలుగో శనివారం రావడంతో ప్రత్యేకంగా క్రిస్మస్ రోజు సెలవు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులకు 6 రోజులు మాత్రమే సెలవులు. అయితే మిగతా రాష్ట్రాల్లో డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఫీస్ట్, డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి, డిసెంబర్ 24, 27 క్రిస్మస్ సంబరాలు, డిసెంబర్ 30న యు కియాంగ్ నాన్గ్బాహ్, డిసెంబర్ 31 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సెలవులు వచ్చాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన