తమిళ వర్షన్ ఊపిరి రిలీజ్ కు అడ్డు..

- March 24, 2016 , by Maagulf
తమిళ వర్షన్ ఊపిరి రిలీజ్ కు అడ్డు..

నాగార్జున , కార్తి , తమన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు , తమిళ్ లో తెరకెక్కిన చిత్రం ఊపిరి. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని రేపు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ భాషలలో రిలీజ్ కాబోతుండగా , తమిళ వర్షన్ రిలీజ్ కు అడ్డు పడింది. తమిళం లో తోజా పేరుతో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్ర టైటిల్ నాదే అంటూ నిర్మాత ఎన్.సుందరేశ్వరన్ అలియాస్ సుందర్ చెన్నై సివిల్ కోర్ట్ పిర్యాదు చేసాడు.ఈ మేరకు ఈరోజు కోర్ట్ విచారణ జరపనుంది. ఒకవేళ విచారణ జరిపి సమస్య క్లియర్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది. విచారణ గనుక పోస్ట్ పోనే అయితే సినిమా రిలీజ్ కు అడ్డు పడినంటే అని చిత్ర నిర్మాత పి.వి.పి టెన్షన్ పడుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com