సోయా పాలకూర

- June 08, 2015 , by Maagulf
సోయా పాలకూర

 

కావలసిన పదార్ధాలు:

  • సోయా చంక్స్      - 1/4 కిలో
  • పాలకూర             - 4 కట్టలు
  • పచ్చిమిర్చి          - 6
  • వెల్లుల్లి                - 4 రెబ్బలు
  • ఉల్లిపాయ            - 1
  • ఉప్పు                 - తగినంత
  • జీలకర్ర                - 1 టీ స్పూను
  • ధనియాల పొడి     - 1 టీ స్పూను
  • గరం మసాల         - 1 టీ స్పూను
  • నీళ్ళు                 - తగినన్ని
  • జీలకర్ర పొడి          - 1 టీ స్పూను
  • పసుపు               - 1/2 టీ స్పూను
  • నిమ్మరసం           - 1/2 టీ స్పూను
  • టమాటో గుజ్జు      - 2 టీ స్పూన్లు
  • నూనె                  - 2 టేబుల్ స్పూన్లు

 

చేయు విధానం:

  • సోయా చంక్స్ వేడినీళ్ళలో వేసి పది నిమిషాలు ఉంచాలి.
  • ప్రెషర్ పాన్ లో నూనె వేసి పసుపు, జీలకర్ర వేసి వేయించాలి.
  • తరువాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
  • ఇందులో వెల్లుల్లి ముక్కలు, సోయా చంక్స్ వేసి కాసేపు వేయించాలి.
  • ధనియాల పొడి, గరం మసాలా, టమాటో గుజ్జు వేసి కలపాలి.
  • తరువాత సుమారు ఓ గ్లాసు నీళ్ళు పోసి కలిపి ఉడికించాలి.
  • నీళ్ళన్నీ ఆవిరైపోయాక తురిమిన పాలకూర వేసి సిమ్ లో ఉడికించాలి.
  • పచ్చిమిర్చి గుజ్జు కూడా వేసి మూడు నిమిషాలు ఉడికించాక దించాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com