తెలంగాణ: జనవరి 30 వరకు విద్యాసంస్థలు బంద్
- January 16, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ స్పందిస్తూ విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు చర్యలు చేపట్టాలని.. ఆమేరకు ఆన్ లైన్ లో తరుగతులను నిర్వహించుకోవాలి సూచించింది.
కాగా సంక్రాంతి సెలవులపై ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిన నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు 15 నుండి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలకు కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. వాక్సినేషన్ కు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశించింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







