న్యూజిలాండ్‌లో ఎంపీగా తెలుగమ్మాయి..!
- January 16, 2022
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయి గడ్డం మేఘన(18)కు అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు.తాజాగా ఆ దేశ నామినేటెడ్ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా మేఘన ఎన్నికయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన రవికుమార్ అక్కడే స్థిరపడిపోయారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ఇక స్కూల్ డేస్ నుంచే మేఘన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. అలాగే ఆ దేశానికి వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, కనీస వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ 16న జరిగిన ఈ ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్ నాన్ డిమోలెన్ తాజాగా మేఘన ఫ్యామిలీకి తెలియజేశారు. ఫిబ్రవరిలో మేఘన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







