కువైట్ లో రోజుకు 11వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు
- January 16, 2022కువైట్ సిటీ: కువైట్ లో రోజురోజుకు ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి.తాజాగా ట్రాఫిక్ విభాగం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.2021 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 4,03,608 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అంటే రోజువారీగా సరాసరి 11వేల ఉల్లంఘనలు నమోదయ్యాయి.వీటిలో చాలా వరకు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. కూడళ్లలో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వాహనదారులు చేసే ప్రతి చిన్న ఉల్లంఘన కూడా రికార్డు అవుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం పేర్కొంది. కనుక వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం మంచిదని సూచించింది. అటు ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జరిమానాలను భారీగా పెంచిన వాహనదారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..