ఏపీ కరోనా అప్డేట్
- February 20, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.
ఒక్కరోజు వ్యవధిలో 936మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 19వేల 241 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,29,77,640 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,94,818. రాష్ట్రంలో 6వేల 754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 713కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రోజురోజుకి కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం అని నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక