భారత్‌లో పిల్లలకు మరో వ్యాక్సిన్
- February 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో పిల్లలకు దేశీయంగా తయారైన మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-18ఏళ్ల వారి కోసం బయోలాజికల్-ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్ కు డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతులు పొందింది.కొవాగ్జిన్ తరహాలోనే కోర్బెవ్యాక్స్ ను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది.
పెద్దలకు టీకా వేసే విషయంలో దేశీయంగా తయారైన ఈ కొవిడ్ వ్యాక్సిన్‌కు గతేడాది డిసెంబర్ 28నే అత్యవసర వినియోగ అనుమతులు లభించినప్పటికీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మాత్రం భాగం కాలేదు.
5-18 వయసు చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రెండో, మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో బయోలాజికల్-ఇ సంస్థకు అనుమతి లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెండో, మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు బయోలాజికల్-ఇ సంస్థ తెలిపింది. భారత్ లో పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన రెండో వ్యాక్సిన్ ఇదే.
కోర్బెవ్యాక్స్ టీకా 0.5ఎంఎల్(సింగిల్ డోస్), 5ఎంఎల్(10 డోసులు), 10ఎంఎల్(20 డోసులు) వయల్ ప్యాక్స్ లో వస్తుంది. బయోలాజికల్-ఇ.. హైదరాబాద్ బేస్డ్ ఫర్మ్. 1953లో నెలకొల్పారు. దేశంలో తొలి ప్రైవేట్ సెక్టార్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇదే. అంతేకాదు దక్షిణ భారత దేశంలో తొలి ఫార్మాకూటికల్ కంపెనీ కూడా ఇదే.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్