57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్

- February 23, 2022 , by Maagulf
57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్

బహ్రెయిన్: ప్రభుత్వ రంగ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇ-సర్వీసుల సంఖ్యను పెంచింది.ఇప్పటి వరకు విజయవంతంగా అమలవుతున్న ఎనిమిది ప్రభుత్వ రంగాల్లో కొత్తగా 57 ఇ-సేవలను ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రారంభించింది. 2021 చివరి వరకు ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా iGA 563కి పైగా ఇ-సర్వీసులను అందించింది. వీటిలో 434 సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా అందించారు. నేషనల్ పోర్టల్‌ ను 15 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. 2020తో పోల్చుకుంటే 37% పెరుగుదల నమోదయ్యింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆర్థిక లావాదేవీలు 2020తో పోలిస్తే 65% పెరిగాయి.  3.7 మిలియన్లకుపైగా సిటిజన్స్/రెసిడెంట్స్ ఇ-సర్వీసులను వినియోగించుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com