తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి ని ప్రారంభించనున్న మంత్రి కే.టి.ఆర్
- March 03, 2022
హైదరాబాద్: రూ.29 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జి ని శుక్రవారం నాడు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహా నగరం నలువైపులా విస్తరిస్తున్న నగరీకరణ వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది.
వ్యూహాత్మక రోడ్ డెవలప్మెంట్ (SRDP) పథకం ద్వారా చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. అండర్ బ్రిడ్జి నిర్మాణం తో పాటుగా అప్రోచ్ రోడ్డు డ్రైనేజ్ పనుల కోసం రూ.29 కోట్ల 10 లక్షల వ్యయంతో జిహెచ్ఎంసి రైల్వే శాఖ నిధులతో చేపట్టారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగం అవుతుంది. మొత్తం 375 మీటర్ల పొడవు, 40 మీటర్ల బాక్స్ డ్రైనేజ్ 245 మీటర్ల అప్రోచ్ రోడ్డు అందులో 86 మీటర్ల ర్యాంపు రోడ్డు, మెట్టుగూడ వైపు మరో 159 మీటర్ల ర్యాంపు మారేడు పల్లి వైపు నిర్మాణం చేపట్టారు. 5.50 మీటర్ల వెడల్పు గల అప్రోచ్ రోడ్డు క్యారేజ్ మార్గం 150 వెడల్పు బాక్స్ పోర్షన్, మరో 150 మీటర్ల వెడల్పు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. లాలగూడ రైల్వే స్టేషన్ కు రైళ్ల రాకపోకలు వల్ల తరుచు గా మూసీ ఉండే రైల్వే లెవెల్ క్రాసింగ్ వలన ఇబ్బందిని తొలగించేందుకు అండర్ బ్రిడ్జి వలన ఉపశమనం కలుగుతుంది.
ఆర్ యు బి వలన మల్కాజిగిరి, మారెడ్ పల్లి, తార్నాక, మెట్టుగూడ, లాలా పేట్ సికింద్రాబాద్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీ ని తగ్గిస్తుంది. అంతే కాకుండా మౌలాలి, మల్కాజిగిరి, తార్నాక నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు మంచి కనెక్టివిటీ గా ఉంటుంది. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు LC 256/ E లెవల్ క్రాసింగ్ వద్ద తుకారాం గేట్ వద్ద మల్కాజిగిరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మాణ పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







