ఉద్యోగులకి 100 కార్లు గిఫ్ట్ ఇచ్చిన ఓ ఐటీ సంస్థ
- April 12, 2022
చెన్నై:తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు 100 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. కంపెనీ ప్రగతిలో సహకరించిన ఉద్యోగులకు.. అసాధారణ మద్దతు ఇచ్చినవారికి కార్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.నగరానికి చెందిన ఐడియాస్2ఐటీ అనే కంపెనీ వంద ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది.
పదేళ్ల నుంచి కంపెనీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వంద మంది ఉద్యోగులకు 100 కార్లను ఇస్తున్నట్లు Ideas2IT కంపెనీ మార్కెటింగ్ అధిపతి హరి సుబ్రమణియం తెలిపారు. తమ కంపెనీలో సుమారు 500 ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు.తాము పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు ఇవ్వడం తమ ఉద్దేశమని తెలిపారు.కంపెనీ ఉద్యోగులకు కార్లు ఇవ్వడం లేదని, ఉద్యోగులే తమ సామర్థ్యాన్ని ధారిపోసి ఆ కార్లను స్వొంతం చేసుకున్నారని చైర్మెన్ మురళీ వివేకానందన్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







