'సర్కారు వారి పాట' ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తి

- April 12, 2022 , by Maagulf
\'సర్కారు వారి పాట\' ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తి

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ చిత్రానికి సంబధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా రికార్డులు సృష్టించాయి.

మొదటి పాటగా విడుదలైన 'కళావతి' మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని ఫస్ట్ అప్పియరెన్స్ తో వచ్చిన రెండో పాట 'పెన్ని' సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సితార క్యూట్ అండ్ ట్రెండీ డ్యాన్స్ లతో ప్రేక్షకులని మెస్మైరైజ్ చేసింది. సితార అప్పియరెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కు సన్నాహాలు చేస్తుంది. మిలిగిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు వుండటంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ అప్డేట్స్ తో ముందుకొస్తున్నారు.

ఇప్పటికే రెండు పాటలు సూపర్ హిట్స్ కావడంతో ఆల్బమ్ లో మరో సూపర్ హిట్ పాట కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు సినిమా విడుదలకు ముందు  యూనిట్ చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ ని జరుపుకోనుంది.

జాతీయ అవార్డ్ విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా,  ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ - యుగంధర్
పీఆర్వో : వంశీ- శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com