హైదరాబాద్ స్కిల్ సెంటర్‌లో ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్వల్పకాలిక శిక్షణ
- April 12, 2022
హైదరాబాద్: GMR గ్రూప్ యొక్క CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగం GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) తెలంగాణలోని పాఠశాల/కళాశాల డ్రాపౌట్‌లు,వెనుకబడిన వర్గాల యువత కోసం అనేక వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలను అందిస్తోంది.వీటిలో చాలా కోర్సులు 3 నెలల వ్యవధిని కలిగి, వివిధ పరిశ్రమల సహకారంతో నిర్వహించబడుతున్నాయి.శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
GMRVF-ఎలక్ట్రీషియన్, F&B స్టీవార్డ్, ఆటోమొబైల్ (ద్విచక్ర వాహనం) రిపేర్, ఎక్స్‌కవేటర్ ఆపరేటర్, డ్రైవాల్స్ మరియు ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్, అగ్రి క్లినిక్ & అగ్రి బిజినెస్ సెంటర్‌లలో కస్టమైజ్డ్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.శిక్షణ కాలంలో పురుష అభ్యర్థులకు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించబడుతుంది.డేటా ఎంట్రీ ఆపరేటర్ (కంప్యూటర్ ఆపరేటర్) & టైలరింగ్ (స్వయం ఉపాధి టైలర్) మహిళలకు ప్రత్యేకం.ఈ కోర్సులు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి.కోర్సులు ఎలాంటి ఫీజూ లేకుండా అందించబడతాయి.
నాణ్యమైన శిక్షణ, జాయింట్ సర్టిఫికేషన్ మరియు ప్లేస్‌మెంట్ సపోర్ట్ కోసం హైదరాబాద్‌లోని GMRVF సెంటర్ - వోల్టాస్, ష్నైడర్, హీరో మోటోకార్ప్ డీలర్లు, వోల్వో, సెయింట్ గోబెన్ - జిప్రోక్, మేనేజ్ మొదలైన పారిశ్రామిక భాగస్వాములతో టైఅప్ అయింది. యోగా, ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, వ్యక్తిత్వ వికాసం మొదలైన వాటిపై రెగ్యులర్ క్లాస్‌లతో సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తారు.ఈ కేంద్రంలో శిక్షణ స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా అందిస్తున్నారు.
శంషాబాద్‌లోని GMRVCEL (GMR వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్స్-హైదరాబాద్) అనేది స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.ఇక్కడ 2008 నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అనేక నైపుణ్య ఆధారిత శిక్షణా సౌకర్యాలను అందిస్తున్నారు.ఇక్కడి అనుభవం ఆధారంగా, ఫౌండేషన్ తన విస్తరణను ప్రారంభించి, తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో రాయికల్, నాగారంలలో కూడా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల నుండి ఏటా 1500 మందికి పైగా యువత మెరుగైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు అన్ని పని దినాలలో ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య 8985800102 లేదా 9494800102కు కాల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!