ట్యాక్స్ పేయర్ల కోసం జట్కా యాప్ ప్రారంభించిన సౌదీ

- April 15, 2022 , by Maagulf
ట్యాక్స్ పేయర్ల కోసం జట్కా యాప్ ప్రారంభించిన సౌదీ

సౌదీ అరేబియా: జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, కొత్త యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ట్యాక్స్ పేయర్లు తమంతట తాముగా ట్యాక్స్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ’జట్కా‘ పేరుతో ఈ యాప్ రూపొందించారు. 33 సేవల్ని ఈ యాప్ అందిస్తుంది. జకత్ మరియు ట్యాక్స్ రిటర్నులు, బిజినెస్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్, అభ్యంతరాల సమర్పణ, ట్యాక్స్ మరియు జకత్ సర్టిఫికెట్ల పరిశీలన వంటివి ఈ యాప్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకోసం అథారిటీ బ్రాంచీలను గతంలో సంప్రదించాల్సి వచ్చేది. అథారిటీ వెబ్‌సైట్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com