పార్కింగ్ రుసుము చెల్లింపు కోసం సరికొత్త ఆప్షన్

- April 15, 2022 , by Maagulf
పార్కింగ్ రుసుము చెల్లింపు కోసం సరికొత్త ఆప్షన్

అబుదాబీ : అబుదాబీ  నివాసితులు, దర్బ్ యాప్ ద్వారా పార్కింగ్ రుసుము చెల్లించవచ్చు. చెల్లింపుల కోసం మెసేజ్ పంపించాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారానే సులభంగా పార్కింగ్ రుసుము చెల్లించడానికి వీలవుతుంది. దర్బ్ యాప్‌లో మవాకిఫ్ రీచార్జబుల్ కార్డుల ద్వారా ఇ-వ్యాలెట్‌లో నగదుని పొందుపరచవచ్చు. ఇప్పుడున్న చెల్లింపు విధానంతో పోల్చితే కొత్త విధానం ఎంతో సౌకర్యవంతమైనది. దర్బ్ యాప్‌లోని ‘పే ఫర్ పార్కింగ్’ బటన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com