సౌదీ సిటీ కాసిమ్కి వచ్చే నెల నుంచి ఫ్లై దుబాయ్ విమానాలు
- April 21, 2022
దుబాయ్: ఫ్లై దుబాయ్, సౌదీ అరేబియాలోని కాసిమ్కి మే 1 నుంచి రోజువారీ విమానాల్ని పునరుద్ధరించనుంది. సౌదీ అరేబియాలో ఫ్లై దుబాయ్ విమానాలు నడుస్తున్న డెస్టినేషన్ల సంఖ్య దీంతో ఎనిమిదికి చేరనుంది. అలెలా, దమ్మామ్, జెడ్డా, మదీనా, రియాద్, తైఫ్ మరియు యాంబు నగరాలకు ఇప్పటికే విమానాలు నడుస్తున్నాయి. మే 1 నుంచి 9 వరకు ప్రిన్స్ నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు నడుస్తాయి. నార్తరన్ రన్ వే రిఫర్బిష్మెంట్ ప్రాజెక్టు నేపథ్యంలో కాసిమ్ విమానాశ్రయానికి మే 9 నుంచి జూన్ 22 వరకు దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు నడుస్తాయి. జూన్ 23 నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ నుంచి కాసిమ్కి విమానాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







