ఈద్ అల్ ఫితర్ 2022 సెలవుల ప్రకటన

- April 21, 2022 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ 2022 సెలవుల ప్రకటన

యూఏఈ: యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రమదాన్ 29 నుంచి షవ్వాల్ 3 వరకు బ్రేక్ వుంటుంది. యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ ఈద్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తుంది. షవ్వాల్ తొలి రోజున ఈద్ అల్ ఫితర్. హిజ్రి క్యాలెండర్‌లో రమదాన్ మాసం తర్వాత షవ్వాల్ వస్తుంది. మే 2న ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ వచ్చే అవకాశం వుంది. శనివారం ఏప్రిల్ 30 నుంచి బుధవారం మే 4 వరకు సెలవులు వుండే అవకాశముంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com