మక్కాలో భిక్షాటన చేస్తున్న పలువురు అరెస్ట్

- April 25, 2022 , by Maagulf
మక్కాలో భిక్షాటన చేస్తున్న పలువురు అరెస్ట్

సౌదీ: మక్కా - గ్రాండ్ మస్జీదు వద్ద భిక్షాటన చేస్తూ అనేక మంది నివాసితులు, ప్రవాసులు పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని మక్కాలోని భద్రతా అధికారులు అరెస్టు చేశారు. గ్రాండ్ మస్జీదు ప్రక్కన నేరుగా భిక్షాటన చేస్తున్న మొరాకో దేశానికి చెందిన సందర్శకుడితో పాటు, గ్రాండ్ మస్జీదు ప్రాంగణంలో భక్తుల సానుభూతిని పొందేందుకు ప్రయత్నించిన కారణంగా భారతీయ పౌరుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తనకు వైకల్యం ఉందని ప్రజలను మోసం చేస్తూ భిక్షాటన చేస్తున్న యెమెన్ జాతీయుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. మరో వ్యక్తి తన మైనర్ కొడుకును వీల్ చైర్‌లో కూర్చోబెట్టి అడుక్కునే క్రమంలో అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో పిల్లవాడు ఆరోగ్యంతో ఉన్నాడని తేలింది. భిక్షాటనను నిరోధించేందుకు సౌదీ అరేబియా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. సౌదీలో భిక్షాటనను నిషేధించారు. యాచక నిరోధక చట్టం ప్రకారం భిక్షాటన చేసే వారిని అరెస్టు చేస్తున్నారు. ఎవరైనా భిక్షాటన చేయడం, ప్రేరేపించడం, అంగీకరించడం, సహాయం చేయడం లేదా నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా SR100 కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com