యూఏఈలో 9 రోజులపాటు ఈద్ సెలవులు.. పగడ్బందీగా పోలీసు పెట్రోలింగ్

- April 27, 2022 , by Maagulf
యూఏఈలో 9 రోజులపాటు ఈద్ సెలవులు.. పగడ్బందీగా పోలీసు పెట్రోలింగ్

యూఏఈ: 9 రోజులపాటు ఈద్ సెలవులు ప్రకటించడంతో యూఏఈ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సెలవు రోజుల్లో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈద్  సమయంలో రస్ అల్ ఖైమా పోలీసులు ఎమిరేట్ అంతటా 80 పెట్రోలింగ్ వాహనాలను మోహరించనున్నారు. చట్ట ఉల్లంఘనలను గుర్తించేందుకు రోడ్లపై కూడా రాడార్లు, కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలింగ్ వాహనాల సమీపంలోని మాల్స్, పార్కులు, మస్జీదులు, పర్యాటక ప్రాంతాల వద్ద రద్దీ ప్రాంతాలలోనూ నిఘాను పర్యవేక్షిస్తామని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అలీ అబ్దుల్లా అల్వాన్‌ తెలిపారు. ప్రజలు నుంచి వచ్చే 901 నంబర్‌పై సందేహాలను, 999లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్స్ గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com