బలవంతంగా వ్యభిచారంలోకి.. మహిళపై విచారణ
- May 01, 2022
బహ్రెయిన్: మరో మహిళను మోసం చేసి వ్యభిచారంలోకి దింపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల ఆసియా మహిళ కేసు విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ భర్త నకిలీ జాబ్ ఆఫర్‌ను అందించి బాధితురాలిని బహ్రెయిన్‌లోకి రప్పించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యభిచారం చేయాలని బాధితురాలిని దారుణంగా కొట్టారని చెప్పారు. బాధితురాలు తనను నిర్బంధించిన అపార్ట్ మెంట్ నుండి తప్పించుకుని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి సాయంతో పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఓ మహిళను బందీగా ఉంచి, ఆమెను వ్యభిచారంలోకి దింపినట్లు సదరు మహిళపై అభియోగాలు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







