ఔట్ సోర్సింగ్ కేంద్రాల సమయాల మార్పు చేసిన భారత ఎంబసీ

- May 02, 2022 , by Maagulf
ఔట్ సోర్సింగ్ కేంద్రాల సమయాల మార్పు చేసిన భారత ఎంబసీ

కువైట్: కువైట్‌లో భారత ఎంబసీ, బిఎల్ఎస్ అంతర్జాతీయ ఔట్‌సోర్సింగ్ కేంద్రాల సని సమయాల్ని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టు, వీసా మరియు కాన్సులర్ అటెస్టేషన్ వంటి వాటికి సంబంధించి ఈ మార్పులు మే 3 నుంచి అమల్లోకి వస్తాయి. బిఎల్ఎస్ సెంటర్స్ కువైట్ సిటీ (మూడో ఫ్లోర్ - జవహర టవర్, అలి అల్ సలెమ్ స్ట్రీట్ కువైట్ సిటీ), అబ్బాసియా (మెజామిన్ ఫ్లోర్, ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్ జిలీబ్ అల్ సుయోక్), మరియు ఫహాహీల్ (అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, ఫహాహీల్), శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. కాన్సులర్ అటెస్టేషన్ కోసం డాక్యుమెంట్ల డిపాజిట్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో వుంటాయి. తిరిగి వాటిని సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఇవ్వబడతాయి. 10 గంటల తర్వాత అటెస్టేషన్ కోసం ఇవ్వబడే డాక్యుమెంట్లు మరుసటి రోజు తిరిగి ఇవ్వబడతాయి. అత్యవసర సేవలకు ప్రత్యేక వెసులుబాట్లు వుంటాయి. [email protected] సంప్రదించడం ద్వారా అవసరమైన సాయం అందించబడుతుంది. వాట్సాప్ ద్వారా వాయిస్ లేదా టెక్స్ట్ పంపించే వెసులుబాటు కూడా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com