కువైట్‌లో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
- May 04, 2022
కువైట్: కువైట్‌లో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. కొన్ని రూట్లలో విమాన టిక్కెట్ల ధరలు 70 నుండి 150 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ఈ సంవత్సరం సుదీర్ఘ సెలవుల కారణంగా కువైట్ నుండి ప్రయాణీకులు యూఏ, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ లకు ఎక్కువగా వెళ్లారు. దీంతో ఆయా మార్గాల్లో టిక్కెట్ ధరలకు అధిక డిమాండ్ ఏర్పడింది. కువైట్ ఎయిర్‌వేస్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ వేల్ అల్ హసావి మాట్లాడుతూ.. ఈద్ సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు వివిధ దేశాలకు ప్రయాణించారు. కొన్ని రూట్లలో డిమాండ్ ను తగ్గట్లుగా విమానాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు 2,800 విమానాలను నడుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈద్ సందర్భంగా 76 అదనపు విమానాలను నడిపినట్లు అల్ హసావి తెలిపారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







