దమ్ముంటే మళ్లీ తన పై పోటీ చేయాలంటూ కవితకు ఎంపీ అరవింద్ సవాల్
- May 05, 2022
తెలంగాణ: తెలంగాణ లో బీజేపీ,టిఆర్ఎస్ పార్టీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.ఇరు నేతలు ఎక్కడ తగ్గకుండా ఒకరి ఫై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత..నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫై పలు వ్యాఖ్యలు, సవాళ్లు విరిసింది.ఈ క్రమంలో కవిత కు అరవింద్ సవాల్ విసిరాడు. దమ్ముంటే మళ్ళీ తనపై పోటీచేయాలని అరవింద్ సవాల్ విసిరారు. ఓటమి మత్తు దిగటంతో కవిత మూడేళ్ళ తర్వాత బయటకొచ్చిందని వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘నాపై రాజకీయ పోరాటానికి కవిత సిద్దంగా ఉండాలి. పసుపు బోర్డుపై పసుపు రైతుల సమక్షంలో కవితతో చర్చకు సిద్ధం.ధైర్యముంటే సెక్యూరిటీని పక్కన పెట్టి కవిత చర్చకు రావాలి. మహిళ కాబట్టి బతికిపోతోంది. పసుపు రైతుల చేతిలో కవితకు పరభావం తప్పదు. తండ్రి, అన్న మాదిరి కవిత .. చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు. కవిత చెప్పే మాటలు వింటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు’’ అని అన్నారు. గులాబీలకు, పింకీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీ అని, టీఆర్ఎస్ పతనమే బీజేపీ లక్ష్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







