డార్లింగ్ ప్రబాస్‌తో హీరోయిన్లకు ఆ ఇష్టమైన ‘కష్టం’ ఏంటీ.?
- May 10, 2022
ప్రబాస్ అంటే అందరికీ డార్లింగే. నో డౌట్ అందులో. కానీ, అమ్మాయిలకు ఇంకాస్త ఎక్కువ డార్లింగ్. హ్యాండ్సమ్ లుక్స్, హైటూ, వెయిటూ.. ఈ విషయంలో అమ్మాయిలకు ప్రబాస్ అంటే ఇష్టం అనుకుంటున్నారా.? అయితే, మీరు పప్పులో కాలేసినట్లే. మనం మాట్లాడుకునే ఇష్టం నెక్స్ట్ లెవల్.
అసలు విషయానికి వచ్చేద్దాం.. ప్రబాస్‌తో సినిమా చేస్తే ఫుడ్‌కి అస్సలు లోటుండదు. స్వయంగా ఇంటి నుంచి క్యారియర్లు వచ్చేస్తుంటాయ్. రోజూ విందు భోజనమే. అందులోనూ నాన్ వెజ్ భోజనం. ముఖ్యంగా ప్రబాస్‌తో పని చేసే హీరోయిన్లకు ఆయన ఇంటి వంట రుచి చూపించకుండా అస్సలుండరు మరి.
గతంలో ప్రబాస్‌తో పని చేసిన చాలా మంది ముద్దుగుమ్మలు ఈ విషయాన్ని చెప్పారు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ సహా, ఇటీవల పూజా హెగ్దే సైతం ప్రబాస్ ఇంటి భోజనం గురించి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రబాస్ ‘ప్రాజెక్టు కె.’ సినిమా సెట్స్ మీద వుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకేముంది.. రాజుగారి భోజనానికి దిశా పటానీ కూడా రెడీ అయిపోయినట్లే.. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది దిశా పటానీ. ఫుల్ ప్యాక్డ్ భోజనం క్యారియర్ల ఫోటోలు అవి.
అసలే హీరోయిన్లు డైట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ప్రబాస్‌తో సినిమా చేస్తే మాత్రం ఫుడ్ విషయంలో ముద్దుగుమ్మల పప్పులస్సలుడకవట. ఖచ్చితంగా తినాల్సిందేనట. అదే అందాల భామ దిశా పటానీ చెబుతోంది. ప్రబాస్ ఇంటి భోజనం చేసి, డబుల్ వర్కువుట్లు చేయాల్సి వస్తోంది.. అని పన్నీగా చెప్పేసింది. నిజమే.. ముద్దుగుమ్మలకు ఇది ఇష్టమైన కష్టమే సుమీ.!
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







