పన్ను ఎగవేసిన ప్రవాసుడికి జరిమానా, జైలు శిక్ష
- May 13, 2022
మస్కట్: పన్ను రిటర్నులను సమర్పించడంలో విఫలమైన ఒక ప్రవాసికి OMR 1,000 జరిమానాతోపాటు ఒక నెల జైలు శిక్షను విధించారు. జైలు శిక్ష అనంతరం అతన్ని ఒమన్ సుల్తానేట్ నుండి బహిష్కరించనున్నారు. రాయల్ డిక్రీ నంబర్ జారీ చేసిన ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు ప్రవాసిపై చర్యలు తీసుకున్నారు. ఈమేరకు విలాయత్ ఆఫ్ అల్ బురైమిలోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ ఇటీవల కోర్టు తీర్పును జారీ చేసింది. నిందితుడు పన్ను రిటర్నులను సమర్పించలేదని, ఇన్ కం టాక్స్ చట్టంలోని రాయల్ డిక్రీ నెం.28/2009 పన్ను నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పన్ను అథారిటీ తెలిపింది. న్యాయ నియంత్రణ అధికారులు విచారణలు నిర్వహించి, సాక్ష్యాలను సేకరించి, రికార్డులను తయారు చేశారు. ఆపై కేసు ఫైల్ చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని పబ్లిక్ ఫండ్స్, మనీ లాండరింగ్ కేసుల విభాగానికి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







