మహిళను రక్షించడానికి సముద్రంలో దూకిన అధికారి
- April 06, 2016
సముద్రంలో ఓ మహిళ మునిగిపోతుండడాన్ని చూసి జూనియర్ పోలీస్ అధికారి ఒకరు క్షణం ఆలోచించకుండా ఆమెను రక్షించడానికి సముద్రంలోకి దూకిన ఘటనకు పలువురి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సాహస అధికారి పేరు మొహమ్మద్ అల్ అహ్మద్. రస్ అల్ ఖైమాలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారీయన. రస్ అల్ ఖైమా పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ అలీ అల్వాన్ అల్ నువామి, లెఫ్టినెంట్ అల్ అహ్మద్‌ని సన్మానించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ ఆ మహిళ సముద్రంలో మునిగిపోయింది. అది గమనించిన అల్ అహ్మద్ వెంటనే సముద్రంలోకి దూకి, ఆమెను రక్షించారు. బలమైన కెరటాల్ని లెక్కచేయకుండా అల్ అహ్మద్, ఓ మహిళను రక్షించడం ప్రశంసలు పొందుతోంది. బాధిత మహిళకు తక్షణం ప్రాధమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించారు. సముద్ర తీర ప్రాంతాల్లో విహారానికి వెళ్ళేవారు, స్విమ్మింగ్ చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









