గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్

- June 03, 2022 , by Maagulf
గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్

బహ్రెయిన్: 2021 ఈవెంట్‌సియం హాల్ ఆఫ్ ఫేమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డును బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA), ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (EWB) గెలుచుకున్నాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాలకు సంబంధించిన కన్వెన్షన్, కాన్ఫరెన్స్ సెంటర్‌ విభాగాల్లో ఈ అవార్డును ప్రకటించారు. ఎగ్జిబిషన్ అథారిటీ  సీఈఓ డా. నాసర్ ఖైదీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయిలో పర్యాటకం, MICE రంగంలో ఆవిష్కరణలలో టూరిజం అథారిటీ నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ అంతర్జాతీయ అవార్డును గెలుచుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ ప్రదర్శన, సమావేశ కేంద్రాల స్థాపన, నిర్వహించడంలో రాజ్యం యొక్క ఖ్యాతిని పెంచిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com