బహ్రెయిన్ వైరల్ వీడియోలో యాక్సిడెంట్ ఫేక్!
- June 04, 2022
బహ్రెయిన్: ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోందని, కానీ అది నిజమైనది కాదని బహ్రెయిన్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఆ వీడియోలో చూపినది నిజమైన యాక్సిడెంట్ కాదని స్పష్టం చేసింది. అయితే ఫుటేజ్ నిజమైనదేనని, కానీ దాన్ని ఎవరో ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిపింది. యాక్సిడెంట్ లో గాయపడిన వికలాంగ వ్యక్తిని తన కారుతో ఢీకొట్టిన డ్రైవర్ బాధితుడిని పట్టించుకోకుండా వెళ్లినట్లు, రోడ్డుపై కూర్చున్న అభాగ్యులు సహాయం కోసం వేడుకుంటున్నట్లు వైరల్ వీడియోలో చూపించారు. కానీ తమ విచారణలో అదంతా ఫేక్ అని తేలిందన్నారు. ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తిని గుర్తించామని, సదరు వ్యక్తి ప్రమాదవశాత్తూ కిందపడటం వల్ల గాయపడ్డాడని అతనే స్వయంగా తెలిపినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







