డిజిటల్ సర్వీసులను ప్రారంభించిన ఖతార్ కార్మికశాఖ
- June 04, 2022
ఖతార్: తాత్కాలిక ఉద్యోగ వీసాల అభ్యర్థనల కోసం కొత్త డిజిటల్, పేపర్-లెస్ సేవలను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) వెల్లడించింది. ఇది ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిష్కారాలను అందిస్తుందని పేర్కొంది. దీనితో కార్యాచరణ నైపుణ్యాన్ని సాధించడానికి, వినియోగదారుల సంతృప్తిని పెంచడానికి తన సేవలను ఆటోమేట్ చేసే ప్రయత్నాలలో భాగమని తెలిపింది. కొత్తగా లాంచ్ చేసిన వాటిల్లో నాలుగు ఆటోమేటెడ్ సర్వీసులు ఉన్నాయని, ఇవి ఇంతకు ముందు మాన్యువల్‌గా మాత్రమే ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం అభ్యర్థనలు, ప్రభుత్వ,సెమీ-గవర్నమెంటల్ సంస్థలకు లేబర్ రిక్రూట్‌మెంట్‌ను సర్వీస్, క్యూఎఫ్సీ (QFC) కంపెనీల కోసం లేబర్ రిక్రూట్మెంట్ రిక్వెస్ట్ సర్వీసులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల కోసం రిక్రూట్మెంట్ అభ్యర్థనలు ఆటోమేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే స్వయంచాలకంగా ఆమోదించబడతాయి. మునుపటి ఆరు-దశల ఆమోదం ప్రక్రియ ఇప్పుడు ఒకే దశలో పూర్తవుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దాని వెబ్సైట్ https://www.mol.gov.qa/ద్వారా దాదాపు 47 ఇ-సేవలను అందిస్తోంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







