నిఖిల్ ప్యాన్ ఇండియా ప్లానింగ్ మావులుగా లేదుగా.!

- June 06, 2022 , by Maagulf
నిఖిల్ ప్యాన్ ఇండియా ప్లానింగ్ మావులుగా లేదుగా.!

‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన నటుడు నిఖిల్ సిద్దార్ధ్. తర్వాత సోలో హీరోగా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే ఈ యంగ్ హీరో తాజాగా మరో ప్రయోగానికి తెర లేపాడు. అదే ‘స్పై’ మూవీ.

టైటిల్‌లోనే వుంది కదా. స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా నుంచి లెటెస్టుగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్‌లో వుంది ఆ గ్లింప్స్. చేతిలో ట్రాన్స్‌మీటర్ పట్టుకుని మంచు కొండల్లో నడుస్తున్న హీరో, ఆయుధాలతో నిండిన ఒక సీక్రెట్ ప్లేస్‌ని కనుగొనడాన్ని ఈ గ్లింప్స్‌లో చూపించారు. వెరీ స్టైలిష్ అండ్ డేషింగ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నిఖిల్ ఈ గ్లింప్స్‌లో.

టెక్నికల్‌గా చాలా చాలా రిచ్‌గా కట్ చేశారీ టీజర్ బిట్‌ని. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయ్.  ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ కైకో నకహరా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు వుండబోతున్నాయట.

మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్యా మీనన్, నిఖిల్ సిద్ధార్ధ్‌కి జంటగా నటిస్తోంది ఈ సినిమాలో. అలాగే, అల్లరి నరేష్ సోదరుడు, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ‘స్పై’ సినిమాతో నిఖిల్ సిద్ధార్ధ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయమన్న మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com