సమంత అందుకే అదంతా చేసిందా.?

- June 08, 2022 , by Maagulf
సమంత అందుకే అదంతా చేసిందా.?

సౌత్ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో క్లీవేజ్ షోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. మరీ అంత బోల్డ్‌గానా అంటూ సమంతపై అనేక రకాలుగా కామెంట్స్ పడుతున్నాయ్ ఆ ఓవర్ ఎక్స్‌పోజింగ్ వల్ల. అయితే, ఎందుకు సమంత అలా చేస్తోంది.. అంటే, అందుకు కారణం వుందట.

బార్బేరీ అను ఓ ఫ్యాషన్ సంస్థతో ఈ మధ్య సమంత ఒప్పందం కుదుర్చుకుందట. ఇన్నర్ వేర్, బికీనీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ బార్బేరీ సంస్థ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుందట. మొదట్లో సమంత అందుకు ఒప్పుకోలేదట.

కానీ, సోషల్ మీడియాలో సమంతకు ఐకాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ, సమంతనే తమ బ్రాండ్‌కి బ్రండ్ అంబాసిడర్‌గా కావాలనుకున్నారట. అందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. అది దాదాపు కోటి రూపాయలు అని తెలుస్తోంది.

అంటే, ఓ సినిమాకి హీరోయిన్ తీసుకునే రెమ్యునరేషన్ అన్నమాట. అంతలా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు, సమంతను చాలా రకాలుగా సదరు సంస్థ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందట. దాంతో సమంత ఆ ఆఫర్ ఓకే చేయక తప్పలేదట.

అయితే, డబ్బు కోసం మరీ అంతలా దిగజారిపోతావా.? సినిమా చేస్తే 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నావ్ కదా.. అది చాలదా.? బ్రాండ్ ప్రమోషన్ల పేరు చెప్పి బికినీలు, ఘాటైన క్లీవేజ్ షోలతో ఇంతలా రెచ్చిపోవాలా.? అంటూ సమంతను ఆడి పోసుకుంటున్నారు నెటిజనం. హా.! అయినా ఈ నెటిజనానికి పనేముంది చెప్పండి. పొగిడిన నోటితోనే తిడతారు. తిట్టే నోళ్లే పొగుడుతుంటాయ్. అంతేగా అంతేగా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com