రాహుల్‌గాంధీ ఈరోజు కేరళకు...
- April 10, 2016
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్ ఆలయ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. మృతులకు నివాళులర్పించి, క్షతగాత్రుల కుటుంబాలతో రాహుల్ మాట్లాడనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 13 ఆస్పత్రుల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో వందకు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోగా, 300కి పైగా గాయపడ్డారు. మృతులకు పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









