హైదరాబాద్ లో కుండపోత వర్షం
- July 29, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. మధ్నాహ్నాం వరకు విపరీతమైన ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలై భారీ వర్షంగా మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
నేరేడ్ మెట్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క గంటలోనే దాదాపు 129 కంప్లైంట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బేగంపేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , సికింద్రాబాద్, సనత్ నగర్ ,అమీర్పేట్, కొత్తపేట్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంపాపేట్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగం బజార్ తరిత ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది.
రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.యూసఫ్‌గూడలో ఓ వ్యక్తి వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. దానిని ఆపడానికి ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ నీటి ఉద్ధృతికి అది కొట్టుకుపోయింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!