సౌదీ పోస్ట్ లాజిస్టిక్స్ పేరుతో నకిలీ మెసేజ్ లు...

- September 06, 2022 , by Maagulf
సౌదీ పోస్ట్ లాజిస్టిక్స్ పేరుతో నకిలీ మెసేజ్ లు...

సౌదీ అరేబియా: రియాద్ లో ప్రముఖ లాజిస్టిక్ సంస్థ, సౌదీ పోస్ట్ లాజిస్టిక్స్ (SPL) గురించి తెలిసిందే.  ఐతే ఈ సంస్థ పేరుతో కొంతమంది నకిలీ మెసేజ్ లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అచ్చం సౌదీ పోస్ట్ లాజిస్టిక్స్ సంస్థ లోగో ను వాడుతూ మెసేజ్ లు పెడుతున్నారు. మీ వస్తువులను ఇతర ప్రాంతాలకు డెలివరీ చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం సౌదీ లాజిస్టిక్స్ సంస్థ వరకు వెళ్లింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. తమ పేరు మీద ఎవరో ఫేక్ మెసేజ్ లు పంపుతున్నారని...ప్రజలు మోసపోవద్దని సూచించింది. ఈ ఫేక్ మెసేజ్ లకు తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని...ఎవరైనా ఈ సందేశాలు చూసి మోసపోతే తమ బాధ్యత లేదని తేల్చిచెప్పింది. ఐతే ఫేక్ మెసేజ్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని సంస్థ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com