ట్యాంగ్‌ అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌?

- June 15, 2015 , by Maagulf
ట్యాంగ్‌ అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌?

ఖతార్‌లో ట్యాంగ్‌ అమ్మకాలపై శనివారం నుంచి ఉన్న నిషేధం ఎత్తివేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ట్యాంగ్‌ ఫ్రూట్‌ ఫ్లేవర్డ్‌ డ్రిరక్‌లో కొన్ని ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలున్నాయనే ఆరోపణలతో అధికారిక వర్గాలు పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ సేకరించాయి. ఈ కారణంతో ట్యాంగ్‌ అమ్మకాల్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేశారు వ్యాపారులు. శనివారం నుంచీ అమ్మకాలు నిలిచిపోగా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనీ, పరీక్షల్లో ట్యాంగ్‌కి అనుకూలంగా రిపోర్ట్‌ వస్తుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. వేసవి కాలం కావున ట్యాంగ్‌ డ్రిరక్‌కి డిమాండ్‌ అధికంగా ఉంటుంది. చాలా చోట్ల ట్యాంగ్‌ అమ్మకాల్ని నిలిపివేసినా కొన్ని సూపర్‌ మార్కెట్స్‌లో, హైపర్‌ మార్కెట్స్‌లో ఇంకా ట్యాంగ్‌ అందుబాటులోనే ఉంది. సోమవారం తర్వాత ట్యాంగ్‌ అమ్మకాలకు ఏ క్షణంలో అయినా గ్రీన్‌ సిగ్నల్‌ ప్రభుత్వం నుంచి రానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com