యశోద టీజర్ టాక్: గర్భిణిగా సమంత.! చేయకూడనివన్నీ చేసేసిందిగా.!
- September 09, 2022
సమంత మరోసారి నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ ఇవ్వనుందని ‘యశోద’ టీజర్ చెప్పకనే చెప్పేసింది. త్వరలో ‘యశోద’ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్లు.
టీజర్ మొత్తం సమంతే కనిపించింది. సినిమాలో సమంత గర్భిణిగా నటిస్తోంది. గర్భిణిగా వున్నప్పుడు ఏమేం చేయకూడదో, ఎంత జాగ్రత్తగా వుండాలో డాక్టర్, సమంతకు సూచిస్తుంటుంది. కానీ, అందుకు భిన్నమైన సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమంత.
గర్భిణి పాత్రలో సమంత చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. మరోసార ఛాలెంజింగ్ రోలే ఇది సమంతకు అనొచ్చు. గర్భిణిగా వున్న సమంత చుట్టూ ఏదో పెద్ద ప్రమాదమే పొంచి వుంటుంది. ఆ ప్రమాదం నుంచి తనను తాను రక్షించుకుంటూ కడుపులోని బిడ్డను కూడా రక్షించుకునేందుకు శాయ శక్తులా ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో చాలా దారుణమైన హింసలకు గురి కావల్సి వస్తుంది. ఛేజింగ్‌లు, ఫైటింగులూ.. ఇలా ఒక్కటేమిటీ.. ఆధ్యంతం టీజర్ ఆసక్తికరంగా కట్ చేశారు. సమంతకు ‘యశోద’ మరో కెరీర్ బెస్ట్ చిత్రం అవుతుందనిపిస్తోంది. టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి