ఫుట్ బాల్ అభిమానుల కోసం ఫిపా వరల్డ్ కప్ లాస్ట్ మినిట్ సేల్ నేటి నుంచి మొదలు
- September 27, 2022
ఖతార్ : ఫిఫా వరల్డ్ -2022 మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి మెగా టోర్నీని ఖతార్ నిర్వహిస్తోంది. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఐతే ఫుట్ బాల్ అభిమానుల కోసం ఖతార్ లాస్ట్ మినిట్ సేల్ ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్లను ఆన్ లైన్ లో పొందవచ్చు. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు లాస్ట్ మినిట్ సేల్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. టికెట్ల ను ఆన్ లైన్ లో FIFA.com/tickets ద్వారా పొందవచ్చు. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ పద్దతి లో సేల్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్ టికెట్లను నాలుగు కేటగిరీలో అందుబాటులో ఉంచారు. ఖతార్ వాసుల కోసం ప్రత్యేకంగా ఓ కేటగిరీ ఏర్పాటు చేశారు. ఒక్క వ్యక్తి ఒక్కో మ్యాచ్ గరిష్టంగా 6 టికెట్లను కొనుక్కోవచ్చు. ఇక FIFA కూడా ఒక ప్రత్యేకమైన టికెటింగ్ యాప్‌ను విడుదల చేయనుంది. దాన్ని టికెట్ కొనుకున్న వారు డౌన్ లోడ్ చేసుకోవాలి. తమ టికెట్ ను ఈ యాప్‌లో అప్లోడ్ చేసుకోవాలి. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించినప్పుడు వీటిని యాక్టివేట్ చేస్తారు. టికెటింగ్ యాప్‌తో పాటు, స్థానిక మరియు అంతర్జాతీయ అభిమానులందరూ తప్పనిసరిగా డిజిటల్ హయ్యా (ఫ్యాన్ ఐడీ) ని దరఖాస్తు చేసుకోని పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం