మహిళపై 50,000 దిర్హామ్‌ల దావా.. వ్యక్తి పిటిషన్ కొట్టేసిన కోర్టు

- October 06, 2022 , by Maagulf
మహిళపై 50,000 దిర్హామ్‌ల దావా.. వ్యక్తి పిటిషన్ కొట్టేసిన కోర్టు

యూఏఈ: చేతబడి చేస్తున్నాడని ఆరోపించి.. తన ప్రతిష్టను దెబ్బతీసిన మహిళపై వ్యక్తి వేసిన 50,000 దిర్హామ్‌ల దావాను కోర్టు కొట్టేసింది. సదరు వ్యక్తి ప్రతిష్టను మహిళ దెబ్బతీసిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నష్టపరిహార వ్యాజ్యాన్ని అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తిరస్కరించింది. అతను చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఫిర్యాదు చేసినప్పుడు, మహిళ తనకున్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించిందని కోర్టు అభిప్రాయపడ్డది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను చేతబడి చేశానని మహిళ తనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిందని,  అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును కోర్టుకు తరలించకముందే తిరస్కరించిందని సదరు వ్యక్తి తెలిపాడు. ఈ ఆరోపణలు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పని చేసే ప్రాంతంలో తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com