భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి

- October 15, 2022 , by Maagulf
భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి

 

అబుధాబి: ఇటీవల గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమైన నాలుగు దగ్గు, జలుబు మందులపై(ప్రోమెథాజైన్ నోటి ద్రావణం BP, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ, మాగ్రిప్ ఎన్ కోల్డ్) ఎమిరేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో తయారైన ఈ దగ్గు, జలుబు మందులను అబుధాబిలో ఎక్కడా విక్రయించడం లేదని డీఓహెచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ మందులను కొని వినియోగించే వారు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని డిపార్ట్‌మెంట్ కోరింది. భారత్‌కు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు ఔషధాల కారణంగా ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దగ్గు మందులు, జలుబు మందుల వినియోగంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మందుల ఉత్పత్తిపై నిషేధం విధించిన భారత్.. ఆ కంపెనీ ఉత్పత్తులపై దర్యాప్తు ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com