ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలను ఉమ్రాకు అనుమతించిన సౌదీ
- October 15, 2022
ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం వచ్చే ఫుట్ బాల్ అభిమానులు మల్టీ-ఎంట్రీ వీసాతో ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియా అనుమతించింది. ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలు ఉమ్రా చేయవచ్చని, నవంబర్ 11 నుండి డిసెంబర్ 18, 2022 వరకు ఉచిత సౌదీ వీసాతో మదీనాను సందర్శించవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. అలాగే ముస్లిం హయా కార్డ్ హోల్డర్లు రెండు నెలల వరకు దేశంలో ఉండవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వీసా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖలీద్ అల్-షమ్మరి తెలిపారు. వీసా ఉచితమని, కానీ వైద్య బీమా తప్పనిసరిగా వీసా ప్లాట్‌ఫారమ్ నుండి పొందాలని అల్-షమ్మరి సూచించారు. కార్డ్ హోల్డర్లకు మల్టీ-ఎంట్రీ వీసా అందిస్తున్నామని, దాని చెల్లుబాటు వ్యవధిలో వారు ఎప్పుడైనా సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చని, నిష్క్రమించవచ్చని అల్-షమ్మరి వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!