ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు

- October 16, 2022 , by Maagulf
ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు

యెమెన్‌లోని సనాలో గడువు ముగిసిన కీమోథెరపీ ఇంజెక్షన్‌తో 18 మందికి పైగా చిన్నారుల మరణానికి ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా కారణమని యెమెన్‌ సమాచార మంత్రి మొఅమర్ అల్-ఎర్యానీ ఆరోపించారు. మిలీషియా ఆధీనంలో ఉన్న నగరంలోని ఒక ఆసుపత్రిలో లుకేమియాకు చికిత్స పొందుతున్న పిల్లలకు – కలుషితమైన, నెలల తరబడి హౌతీల గిడ్డంగులలో నిల్వ చేయబడిన కీమోథెరపీ ఇంజెక్షన్‌లను వినియోగించినట్లు మంత్రి  వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంస్థలు యెమెన్‌కు విరాళంగా అందించిన కీమోథెరపీ ఇంజెక్షన్లను హౌతీలు ఆసుపత్రులకు పంపిణీ చేశారని అల్-ఎర్యానీ వెల్లడించారు. అయితే, హౌతీలు వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి ముందు చాలా కాలం పాటు నిల్వ చేశారన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అల్-ఎర్యానీ స్పష్టం చేశారు.  అంతర్జాతీయ సంస్థలు ఉచితంగా అందించే మందులను హౌతీ మిలీషియా అడ్డుకోని వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుందని ఆరోపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com