‘కాంతారావు’ శతజయంతి వేడుకలు..
- November 17, 2022
హైదరాబాద్: తెలుగు వారికి కాంతారావు అంటే తెలియకపోవచ్చు గాని ‘కత్తి కాంతారావు’ అంటే మాత్రం తప్పక గుర్తుపడతారు.నవంబర్ 16న అయన శతజయంతి కావడంతో.. నిన్న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాంతారావు శతజయంతి వేడుకలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, స్పెషల్ గెస్ట్‌గా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పాల్గొని కాంతారావుకి నివాళులు అర్పించారు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణికపాత్రలు ధరించిన కాంతారావు తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడని పలువురు కీర్తించారు.
ఈ సందర్భంగా ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. ‘కాంతారావు 400కు పైగా సినిమాల్లో, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఆ చిత్రాలకు ఓ ప్రత్యేకతను చేకూర్చి కత్తి కాంతారావుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా రాబోవు రోజుల్లో ప్రభుత్వం తరపున వివిధ కార్యక్రమాలను రూపొందించనున్నాము’ అని తెలియజేశారు.
జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. ‘కాంతారావు సినిమాల్లో చేసిన కత్తి యుద్ధాలను చూసి చిన్నప్పుడు తాముకూడా కర్రలతో అలానే చేసేవాళ్ళము. కాంతారావు గురించి రాబోవు తరాలకు తెలియజేసేవిధంగా మరిన్ని కార్యక్రమాలు జరపడానికి తనవంతు సహకారం అందిస్తాము’ అని వెల్లడించారు.
హరికృష్ణ మాట్లాడుతూ… కాంతారావు తెలుగు సినిమారంగంలో యన్టీఆర్, అక్కినేనిలకు సమకాలికులుగా సమానమైన గుర్తింపు పొందారు. అంతేకాకుండా “తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే, కాంతారావు వాటి మధ్య తిలకం వంటివారు” అని దాసరి నారాయణరావు పొగిడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున కాంతారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడమేకాకుండా, ప్రతినెలా కాంతారావు సతీమణికి జీవనభృతిని అందజేశామని’ అన్నారు.
కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీశారని.. ఒకప్పుడు మద్రాసు బంగ్లాలో ఉన్న మేము..ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించి .. ఇల్లు కేటాయించాలని కోరారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!