ఎస్వీ రంగారావు ఎవరు.?

- November 17, 2022 , by Maagulf
ఎస్వీ రంగారావు ఎవరు.?

నట శేఖరుడు కృష్ణ మరణంతో తొలి తరం నట శకం ముగిసిపోయింది.. అంటూ ప్రస్థావిస్తున్నారు. ఎన్టీయార్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణలను పంచ రత్నాలుగా అభివర్ణిస్తున్నారు.
అవును కాదనలేం. వీళ్లు పంచ రత్నాలే వీళ్ల తరానికి. కానీ తొలి తరం నటులు వీళ్లు మాత్రం కానే కాదు. తొలి తరం నటులు అంటే, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, కాంతారావు తదితరులున్నారు.
కానీ, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తొలి తరం తొలి తరం.. అని తరచూ ప్రస్థావించడం కొందరు సీనియర్ సినీ ప్రముఖుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. తొలి తరం కథా నాయకుల్లో ఎస్వీ రంగారావు అత్యంత గొప్ప నటుడు. ఆయనతో ఎవ్వరినీ పోల్చలేం. 
అలాగే కాంతారావు కూడా. అయితే, ఆయన ఆర్ధికంగా చితికిపోయారు. దాంతో ఆయన వారసులు సినీ రంగంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో వున్నారు ఆయన వారసులు.
తెలుగు సినీ చరిత్రని కొందరు వక్రీకరిస్తుంటారు. ఎన్టీయార్ గొప్పనటులే కాదనలేం. కానీ, అసలు నటనకు ప్రాణం పోసిన తొలి తరం నటులను మర్చిపోవడం వాళ్ల గౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుందనేది గమనించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com