బెస్ట్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 21, 2022
53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో బెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ అవార్డు ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని వరించింది. గతంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హేమా మాలినీ, రజనీకాంత్, ఇళయరాజా తదితరులు దక్కించుకున్న ఈ అరుదైన పురస్కారం ఈ సారి మెగాస్టార్ చిరంజీవిని వరించింది.
ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియ జేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలపడం విశేషం. ఎందరో హేమా హేమీలను వరించిన ఈ అరుదైన పురస్కారం అన్నయ్య దక్కించుకోవడం ఎంతో ఆనందంగా వుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ అయిన చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. 150 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని దక్కించుకున్న చిరంజీవి ఈ అవార్డు దక్కడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 23న ‘బాస్ పార్టీ’ పేరుతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







