బిట్‌కాయిన్ డీల్ పేరిట భారీ దోపిడీ: ఇద్దరు వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష
- November 28, 2022
దుబాయ్: బిట్‌కాయిన్ ఒప్పందం పేరిట ఆసియాకు చెందిన పెట్టుబడిదారుడిని Dh183,000 మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు జైలు పాలయ్యారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ వారిని దోషులుగా నిర్ధారించి, వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోచుకున్న డబ్బుకు జరిమానా చెల్లించాలని, శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. దుబాయ్‌లోని మన్‌ఖూల్ ప్రాంతంలో ఉంటే ఓ ఆసియా పెట్టుబడిదారుడు డిజిటల్ కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. తన స్నేహితుడు సూచించిన బ్రోకర్ కు ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. ఇన్వెస్టర్ ఇంటికి వచ్చిన బ్రోకర్.. కొనుగోలు చేయాలనుకున్న డిజిటల్ కరెన్సీకి సమానమైన నగదును లెక్కించి ఓ బ్యాగులో పెట్టించి.. 15 నిమిషాల్లో బిట్‌కాయిన్‌ను విక్రయించే వ్యక్తితో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత తన ఇంటికి కొందరు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పెట్టిబడిదారుడితోపాటు అతని స్నేహితుడిపై దాడి చేసి Dh183,000 నగదు, మూడు ఫోన్లు, పత్రాలు, బ్యాంక్ చెక్కులు ఉన్న బ్యాగ్‌ని తీసుకొని పారిపోయారు. ఆ తర్వాత బాధితులు పోలసులను ఆశ్రయించడంతో..కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దొంగతనానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు. గత జులైలో ఈ కేసు నమోదైంది.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్