జెడ్డా వరద పరిహారం.. దరఖాస్తులకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం
- November 29, 2022
జెడ్డా: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం కోసం అభ్యర్థనలను స్వీకరించడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. దరఖాస్తు విధానం, సంబంధిత పత్రాలను వెబ్సైట్ (https://my.998.gov.sa/damagereport/)ద్వారా అప్లోడ్ చేయాలని డైరెక్టరేట్ సూచించింది. వరద పరిహాసం కోసం డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మేయర్ల అధికార ప్రతినిధి ముహమ్మద్ అల్-బకామి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టానికి సమగ్ర కవరేజీని కలిగి ఉన్నవారు మాత్రమే బీమా పాలసీల ద్వారా పరిహారం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పౌరుడు, అతని కుటుంబ సభ్యుల హక్కులకు రాష్ట్రం హామీ ఇస్తుందని నిర్దేశించిన ప్రాథమిక పాలనా చట్టంలోని ఆర్టికల్ 27 ప్రకారం.. రాష్ట్రం ఆమోదించిన కమిటీల ద్వారా పరిహారం నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!