ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల

- November 29, 2022 , by Maagulf
ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఫై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇప్పటీకే ఆరోగ్యశ్రీ ఎన్నో చికిత్సలు తీసుకొచ్చిన జగన్..ఇప్పుడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా…లేదా పొరుగు రాష్ట్రానికి చెందినవారైనా ఆరోగ్యశ్రీ పథకం కిందే చికిత్స జరగనుంది.దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 303 విడుదలైంది.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ పరిస్థితిపై ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో జరిగిన సమీక్షలో మరణాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు.ఈ సమీక్షలో భాగంగా ఈరోజు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఆరోగ్యశ్రీ పధకం కింద పూర్తి చికిత్స అందనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com