బిగ్‌బాస్ 6: ఈ సీజన్ విజేత ఎవరంటే.!

- November 29, 2022 , by Maagulf
బిగ్‌బాస్ 6: ఈ సీజన్ విజేత ఎవరంటే.!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 మొదట్నించీ అడ్డదిడ్డంగా నడుస్తోంది. ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లూ.. విసుగు తెప్పించే బిగ్‌బాస్ టాస్కులు.. అనూహ్యమైన ఎలిమినేషన్లు.. ఇలా ఒక్కటేమిటి.. అడ్డమైన చెత్తా బిగ్‌బాస్ సీజన్‌ 6 లోనే నడుస్తోంది.
బిగ్‌బాస్ విన్నర్స్ బరిలో నిలిచేవాళ్లను ముందే ఎలిమినేట్ చేసి పడేశాడు. అస్సలు ఎలిజిబులిటీ లేని వాళ్లంతా టాప్ 10లో నిలిచారు. ఎలిమినేషన్లపై మొదట్నుంచీ అనుమానాలున్నాయ్ ఈ సీజన్‌లో. 
ఎట్టకేలకు క్లైమాక్స్‌కి చేరుకున్న బిగ్‌బాస్, ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లతో రన్ అవుతోంది. చివరి దశకు చేరుకున్నా, అవే సిల్లీ టాస్కులు. ఎప్పుడో వెళ్లిపోతారనుకున్న కొందరు ఇంకా హౌస్‌లో కొనసాగుతున్నారు. 
కాగా, రేవంత్, శ్రీహాన్ ఈ ఇద్దరికీ మధ్య బిగ్‌బాస్ ఫైనల్ పోరు పడనుందని టాక్ నడుస్తోంది. గత సీజన్‌లో సిరి టైటిల్ కొట్టలేకపోయింది కాబట్టి, ఆ ముచ్చట శ్రీహాన్ ద్వారా తీర్చుకునేలా బయట్నించి ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం కూడా వుంది. అలాగే లేడీస్ నుంచి కీర్తికి ఆ ఛాన్స్ కనిపిస్తోంది. కీర్తి పట్ల బోలెడంత సెంటిమెంట్ పండుతోంది. శ్రీసత్యకు బోలెడంత ఫాలోయింగ్ వున్నప్పటికీ, విన్నర్ అయ్యే అర్హత లేదన్నది నెటిజన్ల అభిప్రాయం. ఈ వారం ఫైమాని లేపేసే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com